Infinix Hot 12 pro: ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలో, ఎక్కువ ప్రత్యేకతలు!

Infinix hot 12 pro price in india and specifications

  • ఆగస్టు 8వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి..
  • ప్రత్యేక ఆఫర్ కింద 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ మోడల్ ధర రూ.11,999కే విక్రయం
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ ఓఎస్.. 6.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే 

తక్కువ ధరలో ఎక్కువ ప్రత్యేకతలను అందించే ఇన్ఫినిక్స్ సంస్థ తమ హాట్ 12 ప్రో ఫోన్ ను తాజాగా ఇండియాలో విడుదల చేసింది. ఆగస్టు 8వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ వివిధ వేరియంట్లు.. రూ.10,999 కనీస ధర నుంచి లభించనున్నాయి. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతలను కంపెనీ తాజాగా వెల్లడించింది.

  • హాట్ 12 ప్రోలో 6.6 అంగుళాల హెచ్డీ (1,612 x 720 పిక్సెల్స్) డ్రాప్ నాచ్ డిస్ ప్లే ఉంది. 90 గిగాహెడ్జ్ రీఫ్రెష్ రేటు, 180 గిగాహెడ్జ్ టచ్ సాంప్లింగ్ రేటుతో యూజర్లకు, ముఖ్యంగా గేమ్స్ ఆడే వారికి మంచి అనుభూతి లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.
  • ఈ ఫోన్ లో యూనిసాక్ టీ616 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను అమర్చారు. వివిధ వేరియేషన్లతో గరిష్ఠంగా 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ వరకు మోడల్స్ లభిస్తాయి.
  • ఇంటర్నల్ మెమరీలో నుంచి 5 జీబీ వరకు ర్యామ్ గా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల పెద్ద గేమ్స్ వంటివి కూడా ల్యాగింగ్ లేకుండా ఆడవచ్చని కంపెనీ చెబుతోంది.
  • ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా రూపొందించిన ఎక్స్ ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టం ఈ ఫోన్ లో ఉంటుంది.
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, డెప్త్ సెన్సర్ తోపాటు.. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు వైపులా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ సదుపాయం ఉంది. 
  • 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, లైట్ సెన్సర్, గైరో సెన్సర్, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. 79 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చని లేదా 41 గంటల పాటు ఫోన్ కాల్స్, 12 గంటల పాటు గేమ్స్ ఆడవచ్చని కంపెనీ తెలిపింది.
  • 6 జీబీ ర్యామ్ 64 జీబీ మోడల్ ధర రూ.10,999 కాగా.. 8 జీబీ ర్యామ్ 128 జీబీ మోడల్ ధర రూ.12,999గా నిర్ధారించారు. అయితే ప్రత్యేక ఆఫర్ కింద 8 జీబీ ర్యామ్ 128 జీబీ మోడల్ ను కొద్ది రోజుల పాటు రూ.11,999కే అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
  • 191 గ్రాముల బరువుతో ఉన్న ఈ ఫోన్లు ఎలక్ట్రిక్ బ్లూ, లైట్ సేబర్ రంగుల్లో లభిస్తున్నాయి.
  • ఆగస్టు 8వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వివిధ బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News