West Indies: మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

team india wins the toss and elected to field first
  • ఐదు టీ20 మ్యాచ్‌ల‌ సిరీస్ 
  • సెయింట్ కీట్స్ వేదికగా మూడో టీ20
  • ఇప్పటికి 1-1గా నిలిచిన ఇరు జ‌ట్లు
వెస్టిండీస్ టూర్‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా మూడో టీ20 మ్యాచ్‌ను మ‌రికాసేప‌ట్లోనే మొద‌లుపెట్ట‌నుంది. సెయింట్ కీట్స్‌లో జ‌రగ‌నున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ రాత్రి 9.30 గ‌ట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఐదు టీ20 మ్యాచ్‌ల‌తో కూడిన ఈ సిరీస్‌లో ఇప్ప‌టిదాకా రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా... టీమిండియా, వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచి సరిస‌మానంగా నిలిచాయి. వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకోవాల‌న్న దిశ‌గా సాగుతోంది.
West Indies
Team India
T20 Series

More Telugu News