Telangana: ద్రోహికి బుద్ధి చెప్పండి.. మునుగోడు కాంగ్రెస్ శ్రేణుల‌కు మాణిక్కం ఠాగూర్ పిలుపు!

manickam tagore harsh tweet on komatireddy rajagopal reddy resignation to congress party
  • రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాపై ఘాటుగా స్పందించిన ఠాగూర్‌
  • కాంగ్రెస్‌కు ద్రోహం చేస్తే సోనియాకు ద్రోహం చేసిన‌ట్టేన‌ని వెల్ల‌డి
  • తెలంగాణ కోసం సోనియా ఎన్నో త్యాగాలు చేశార‌ని వ్యాఖ్య‌
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంపై తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయ‌డం అంటే... తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి సోనియా గాంధీకి ద్రోహం చేసిన‌ట్టేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి మాణిక్కం ఠాగూర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు సోనియా అన్ని రకాలుగా త్యాగం చేశార‌ని ఠాగూర్ స‌ద‌రు ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన సోనియాకు ద్రోహం చేసిన రాజ‌గోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేలా మునుగోడు కాంగ్రెస్ శ్రేణులు స‌మాయ‌త్తం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జై కాంగ్రెస్ అంటూ ఆయ‌న త‌న ట్వీట్‌లో నిన‌దించారు.
Telangana
Congress
Manickam Tagore
Sonia Gandhi
Komatireddy Raj Gopal Reddy
Munugodu

More Telugu News