China: పెలోసీ పర్యటనపై ఆగ్రహం... తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించిన చైనా

China hist Tawain Strait with precision missiles after Nancy Pelosi Taiwan visit

  • తైవాన్ లో పర్యటించిన అమెరికా చట్టసభ స్పీకర్
  • ముగిసిన నాన్సీ పెలోసీ పర్యటన
  • మరుసటి రోజే చైనా నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు
  • యుద్ధనౌకలు మోహరించిన అమెరికా

అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్ లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం... తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది. 

తైవాన్ పర్యటన ముగించుకుని పెలోసీ వెళ్లిపోయిన మరుసటి రోజే చైనా నావికాదళ, వాయుసేన విన్యాసాలు చేపట్టింది. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించింది. తూర్పు తైవాన్ జలసంధిలోని నిర్దేశిత ప్రాంతాలను లక్ష్యాలుగా ఎంచుకుని చైనా లాంగ్ రేంజి ప్రెసిషన్ మిసైళ్లను ప్రయోగించింది. దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ, ఈ విన్యాసాలతో తాము ఆశించిన ప్రయోజనం దక్కిందని వ్యాఖ్యానించింది. 

కాగా, చైనా సముద్ర, గగనతల విన్యాసాలు చేపట్టిన కాసేపటికే అనేక అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. చైనా ప్రతీకార చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితి విషమించకుండా తమ సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది.

  • Loading...

More Telugu News