Sensex: స్వల్ప నష్టాలలో దేశీయ స్టాక్ మార్కెట్లు
- 51 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 6 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా నష్టపోయిన ఎన్టీపీసీ షేర్ విలువ
వరుసగా ఐదు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే కొనసాగాయి. వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298కి పడింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 17,382 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
సన్ ఫార్మా (2.46%), నెస్లే ఇండియా (2.39%), ఇన్ఫోసిస్ (2.20%), డాక్టర్ రెడ్డీస్ (1.33%), విప్రో (0.76%).
టాప్ లూజర్స్
ఎన్టీపీసీ (-3.10%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.46%), రిలయన్స్ (-1.32%), యాక్సిస్ బ్యాంక్ (-1.17%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.10).