Sajjala Ramakrishna Reddy: ఆ వీడియో మార్ఫింగ్ అని మాధవ్ అంటున్నాడు... నిజమైనదేనని తేలితే కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయి: సజ్జల

Sajjala reacts to allegations on MP Gorantla Madhav
  • నగ్నంగా వీడియో కాల్
  • వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో
  • టీడీపీ నుంచి తీవ్ర విమర్శల దాడి
  • స్పందించిన సజ్జల
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ఒకటి ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే, ఇది కుట్ర అని, వీడియో మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అంటున్నారు. తాను జిమ్ లో ఉన్నప్పటి వీడియోను మార్ఫింగ్ చేసి, తాను ఓ మహిళతో మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ వీడియో టీడీపీ వర్గాలకు బలమైన ఆయుధంలా లభించింది. ఈ ఉదయం నుంచి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో అని, వైరల్ అయిందని అన్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి (గోరంట్ల మాధవ్) తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడని అన్నారు. ఈ వీడియో మార్ఫింగ్ చేసినదని గోరంట్ల మాధవ్ చెబుతున్నాడని, ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీ ఎంతమేరకు చర్య తీసుకోగలదో ఆ స్థాయిలో చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఆ చర్యలు అందరికీ గుణపాఠంలా ఉంటాయని అన్నారు.  

అది ఫేక్ వీడియో అని మాధవ్ సవాల్ చేసి చెబుతున్నాడని, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడని సజ్జల పేర్కొన్నారు. విచారణ అనంతరం వెలువడే అసలు నిజం కోసం వేచిచూస్తున్నామని వెల్లడించారు. ఏదేమైనా ఇది ప్రైవేటు వ్యవహారం కాబట్టి తక్కువగా మాట్లాడాల్సి ఉంటుందని, జగన్ చేతల్లోనే చూపిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఇలాంటి వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చి చెప్పారు. సభ్య సమాజంలో మహిళల పక్షపాత పార్టీగా వైసీపీకి గుర్తింపు ఉందని, ఆ గుర్తింపునకు తగినట్టుగానే ఈ వ్యవహారంలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Sajjala Ramakrishna Reddy
Gorantla Madhav
Video Call
Video
YSRCP
TDP

More Telugu News