Venkaiah Naidu: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను ప‌రామ‌ర్శించిన వెంక‌య్య‌నాయుడు... ఫొటో ఇదిగో

venkaiah naidu visits former Prime Minister Manmohan Singh
  • త్వ‌ర‌లోనే ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న వెంక‌య్య‌
  • ఢిల్లీలో మ‌న్మోహ‌న్ ఇంటికి వెళ్లిన ఉపరాష్ట్రప‌తి
  • మాజీ ప్ర‌ధాని ఆరోగ్యంపై ఆరా తీసిన వెంక‌య్య‌నాయుడు
భార‌త ఉపరాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు గురువారం మాజీ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్‌ను ప‌రామ‌ర్శించారు. దేశానికి ప‌దేళ్ల పాటు ప్రధానిగా ప‌నిచేసిన మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. వ‌య‌సు రీత్యా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న మ‌న్మోహ‌న్‌... ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వీల్ చెయిర్‌లో వ‌చ్చిన ఆయ‌న ఓటు వేసేందుకు కూడా ఇత‌రుల స‌హాయం తీసుకున్న వైనం తెలిసిందే.

ఈ క్ర‌మంలో గురువారం ఢిల్లీలో మ‌న్మోహ‌న్ సింగ్ ఇంటికి వెళ్లిన వెంక‌య్య‌నాయుడు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మ‌న్మోహ‌న్ సింగ్ ఆరోగ్యంపై వెంక‌య్య ఆరా తీశారు. త్వ‌ర‌లోనే ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలోనే మ‌న్మోహ‌న్‌ను వెంక‌య్య ప‌రామ‌ర్శించిన‌ట్లు స‌మాచారం. కేంద్ర మంత్రిగా, విప‌క్ష స‌భ్యుడిగా వెంక‌య్య ఇత‌ర పార్టీల నేత‌ల‌తో కూడా స‌ఖ్య‌త‌గానే ఉంటున్న సంగ‌తి తెలిసిందే.
Venkaiah Naidu
Manmohan Singh
Congress
Former Prime Minister

More Telugu News