Sathyadev: సాయితేజ్ చేతుల మీదుగా 'కృష్ణమ్మ' టీజర్ రిలీజ్

Krishnamma  teaser released
  • సత్యదేవ్ తాజా చిత్రంగా 'కృష్ణమ్మ'
  • దర్శకుడిగా గోపాలకృష్ణ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
సత్యదేవ్ కథానాయకుడిగా 'కృష్ణమ్మ' సినిమా రూపొందింది. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమాకి గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యదేవ్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. సాయితేజ్ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేయించారు. 

"ఈ కృష్ణమ్మ లాగే మేము ఎప్పుడు పుట్టామో .. ఎలా పుట్టామో ఎవడికీ తెలియదు. ఎలా పుట్టినా .. ఎక్కడ పుట్టినా .. పుట్టిన ప్రతోడికీ ఏదో కథ ఉండే ఉంటది. కథ నడక .. నది నడత ప్రశాంతంగా సాగాలంటే ఎవ్వడూ కెలక్కూడదు .. కానీ కెలికారు" అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. 

హీరో కోసం పోలీసులు గాలించడం .. అతను తప్పించుకోవడం .. చివరికి దొరికిపోయి వాళ్ల చేతిలో తన్నులు తినడం ఈ టీజర్ లో చూపించారు. తనకి జరిగిన అన్యాయానికి ఎదురుతిరిగే పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను కొరటాల శివ సమర్పిస్తుండటం విశేషం.
Sathyadev
Kalabhairava
Krishnamma Movie

More Telugu News