Aravind Mishra: పాముకాటుతో వ్యక్తి మృతి... అంత్యక్రియలకు వెళ్లిన సోదరుడు కూడా పాముకాటుకు బలి

Man dies of snake bite as his brother also succumbed to death by snake bite
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • మంగళవారం నాడు పాముకాటుతో అరవింద్ మిశ్రా మృతి
  • భవానీపూర్ లో అంత్యక్రియలు
  • లూథియానా నుంచి వచ్చిన సోదరుడు
  • నిద్రిస్తుండగా పాముకాటు
ఉత్తరప్రదేశ్ లో విషాదంలో మరో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో ఓ వ్యక్తి మరణించగా, అతడి అంత్యక్రియలకు వెళ్లిన సోదరుడు కూడా పాముకాటుకు బలయ్యాడు. ఈ ఘటన భవానీపూర్ గ్రామంలో జరిగింది. అరవింద్ మిశ్రా అనే వ్యక్తి మంగళవారం నాడు పాముకాటుతో మరణించాడు. అతడి సోదరుడు గోవింద్ మిశ్రా (22) లూథియానాలో ఉండగా, సోదరుడి మరణవార్త విని భవానీపూర్ వచ్చి, అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

గోవింద్ మిశ్రాతో పాటు వారి బంధువు చంద్రశేఖర్ పాండే (22) అనే యువకుడు కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒక గదిలో పడుకుని ఉండగా, ఇద్దరినీ పాము కరిచింది. గోవింద్ మిశ్రా మరణించగా, చంద్రశేఖర్ పాండే పరిస్థితి విషమంగా ఉంది. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Aravind Mishra
Snake Bite
Govind Mishra
Brother
Uttar Pradesh

More Telugu News