cases: అమెరికా వ్యాప్తంగా ‘మంకీ పాక్స్’ అత్యవసర పరిస్థితి

As cases soar US declares monkeypox outbreak a public health emergency

  • వైరస్ ను ఎదుర్కొనేందుకు మరిన్ని నిధులు, సాధనాలు
  • అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి జేవియర్ బెసెర్రా ప్రకటన
  • వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలని ప్రజలకు పిలుపు
  • దేశవ్యాప్తంగా 6,600కు చేరిన కేసులు

మంకీ పాక్స్ వైరస్ ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)గా అమెరికా ప్రకటించింది. దీనివల్ల వైరస్ పై పోరాడేందుకు కావాల్సిన నిధులు, అదనపు సాధనాలు అందుబాటులోకి వస్తాయని హెల్త్ సెక్రటరీ పేర్కొన్నారు. బుధవారం నాటికి అమెరికాలో మంకీ పాక్స్ కేసులు 6,600కు పెరిగాయి. 

‘‘వైరస్ ను ఎదుర్కోవడంలో మా స్పందనను తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మంకీ పాక్స్ వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలని ప్రతి అమెరికన్ ను కోరుతున్నాం’’ అని ఆరోగ్య శాఖ మంత్రి జేవియర్ బెసెర్రా ప్రకటించారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్ల కేసుల వివరాల లభ్యత పెరుగుతుందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రొచెల్లే వలెన్ స్కీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News