Kangana Ranaut: మీ జీవితంలో విలన్లను కమెడియన్లుగా మార్చేయండి: కంగనా రనౌత్

Kangana Ranaut on how one should treat villains in life Make them comedians
  • విమర్శల నుంచి ఎదిగే ప్రయత్నం చేయాలన్న కంగన 
  • సామర్థ్యాలు పెంచుకునే ఇంధనంగా ఉపయోగించుకోవాలని హితవు
  • భావోద్వేగాలతో వచ్చేదేమీ లేదన్న నటి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వాయిస్ ను బలంగా వినిపించే వారిలో ఒకరు. బలమైన వ్యక్తిత్వం కూడా ఆమె సొంతం. ఈ క్రమంలో జీవితంలో ఆచరించదగిన చక్కని మంత్రాన్ని ఆమె ఉపదేశించింది. గతంలో తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ఆమె విడుదల చేసింది. స్త్రీలు తమ వంతు వచ్చే వరకు వేచి చూడడం కాకుండా, వారే దాన్ని స్వయంగా సాధించాలని సూచించింది.  

"అవమానాలు, వైపల్యాలు, అనుచిత ప్రవర్తన వంటి భావోద్వేగాలను ఉపయోగించుకోవడం నాకు నచ్చదు. ఈ తరహా అనుభవాలతో మన లక్ష్యాలు, సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇంధనంగా ఉపయోగించుకోవాలి. మిమ్మల్ని అభినందించలేని వారి కళ్లలోంచి చూడకండి. వారి విమర్శలను మీరు ఎదగడానికి ఉపయోగించుకోండి. మీరు ఎదుగుతున్న క్రమంలో వారిని చూసి ఆనందించడం మర్చిపోవద్దు. మీ జీవితంలో ఎవరైతే విలన్లుగా ఉండాలని అనుకుంటారో.. వారిని కమెడియన్లుగా మార్చేయండి. ఇదే చక్కని స్టోరీ’’ అని కంగన సూచించింది.
Kangana Ranaut
villains
comedians
actor
life lessons

More Telugu News