Budda Venkanna: సభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను ఎంపీ గోరంట్ల మాధవ్ దాటేశారు: బుద్ధా వెంకన్న

Budda Venkanna says YCP MP Gorantla Madhav crossed all limits of decency
  • గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వ్యవహారం
  • ట్విట్టర్ లో ధ్వజమెత్తిన బుద్ధా వెంకన్న
  • మాధవ్ హేయమైన నేరానికి పాల్పడ్డాడని విమర్శలు
  • జగన్ ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉన్నారని వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్టు ఎంపీ మాధవ్ ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. 

ఈ వ్యవహారంలో సభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాటేశారని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఓ పార్లమెంటు సభ్యుడు, గౌరవప్రదమైన పదవిలో ఉన్నవాడు కావడం మరింత దారుణమని వివరించారు. 

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై గతంలో అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. అతడికి లైంగిక అరాచకాలకు సంబంధించిన చరిత్ర ఉందని, అయినప్పటికీ అతడికి జగన్ టికెట్ ఇచ్చారని, ఇప్పటికీ ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు 'వైసీపీ డర్టీ పిక్చర్' పేరిట బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.
Budda Venkanna
Gorantla Madhav
Video Call
YSRCP
Jagan

More Telugu News