Jagan: ఈరోజు రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్

AP CM Jagan going to Delhi
  • మధ్యాహ్నం ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహానికి హాజరుకానున్న సీఎం  
  • సాయంత్రం విశాఖ నుంచి హైదరాబాదుకు.. అటునుంచి ఢిల్లీకి పయనం 
  • రెండు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్న ముఖ్యమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈసారి రెండు రోజుల పాటు ఆయన హస్తినలోనే మకాం వేయనున్నారు. సాధారణంగా విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరే ముఖ్యమంత్రి... ఈసారి హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. ఈరోజు తొలుత ఆయన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. 

మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న జగన్... మధ్యాహ్నం 3.40 గంటలకు ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు విశాఖ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్ లోని నార్సింగి ఓమ్ కన్వెన్షన్ లో జరిగే జీవీ ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం రాత్రి 7.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతారు.
Jagan
YSRCP
Delhi
Tammineni Sitaram

More Telugu News