PV Sindhu: కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో సెమీస్ కు దూసుకెళ్లిన పీవీ సింధు

PV Sindhu storms into Commonwealth Games Badminto semifinals
  • క్వార్టర్ ఫైనల్స్ లో మలేసియా షట్లర్ పై విజయం
  • తొలి గేము కోల్పోయిన సింధు
  • ఆపై అద్భుత పోరాటం
  • వరుసగా రెండు గేముల కైవసం
భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ క్రీడాంశంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ విభాగంలో మలేసియాకు చెందిన జిన్ వీయ్ గోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో సింధు 19-21 21-14 21-18తో విజయం సాధించింది. మూడు గేముల పాటు జరిగిన ఈ సమరంలో చివరికి సింధుదే పైచేయిగా నిలిచింది. 

తొలి గేమును కొద్ది తేడాతో చేజార్చుకున్న సింధు... ఆపై వరుసగా రెండు గేముల్లో తన సత్తా చాటింది. సింధు స్మాష్ లు, ప్లేస్ మెంట్లకు ప్రత్యర్థి నుంచి జవాబు లేదు. మలేసియా అమ్మాయి జిన్ వీయ్ గో పలుమార్లు నిస్సహాయంగా కోర్టులో కూలబడడడం ఈ మ్యాచ్ లో కనిపించింది.
PV Sindhu
Semifinals
Badminton
Commonwealth Games

More Telugu News