Telangana: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వారం ఆలస్యం
- వచ్చే వారం ప్రకటిస్తామని తెలిపిన అధికారులు
- అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష రాసిన 80,575 మంది విద్యార్థులు
- ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,56,812 మంది హాజరు
తెలంగాణ ఎంసెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి. పరీక్ష ఫలితాలను వచ్చే వారం ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ వారమే రిజల్ట్స్ వస్తాయని భావించినా వారం ఆలస్యంగా వెల్లడవనున్నాయి.
ఎంసెట్ లో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 30, 31వ తేదీల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 18, 19, 20వ తేదీల్లో జరిగిన పరీక్షకు 1,56,812 మంది హాజరయ్యారు.
‘తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చే వారం విడుదలవుతాయి. ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌కు అనుసంధానం చేశారు. కాబట్టి, ఇది అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది. నవంబర్ 1 నుంచి క్లాస్‌వర్క్ ప్రారంభమవుతుంది’ అని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.