PV Sindhu: కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

Indian ace PV Sindhu enters into singles finals in Commonwealth badminton
  • కామన్వెల్త్ క్రీడల్లో సింధు జోరు
  • సెమీస్ లో సింగపూర్ షట్లర్ పై ఘనవిజయం
  • భారత్ కు మరో పతకం ఖాయం
  • పసిడి పతకమే లక్ష్యంగా సింధు పోరాటం
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో ఫైనల్స్ లోకి ప్రవేశించింది. బర్మింగ్ హామ్ లో నేడు జరిగిన సెమీపైనల్ పోరుతో సింధు 21-18, 21-17 సింగపూర్ క్రీడాకారిణి యియో జియా మిన్ పై వరుస గేముల్లో నెగ్గింది. రెండు గేముల్లో సింగపూర్ షట్లర్ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ, సింధు తన అనుభవాన్ని ఉపయోగించి కీలక సమయాల్లో పైచేయి సాధించింది. 

మహిళల సింగిల్స్ లో సింధు ఫైనల్ కు చేరడంతో భారత్ ఖాతాలో ఓ పతకం ఖాయమైంది. సింధు మాత్రం పసిడి పతకానికే గురిపెట్టినట్టు కామన్వెల్త్ క్రీడల్లో తన ఆటతీరు చూస్తే స్పష్టమవుతుంది. సింధు ఫైనల్లో కెనడాకు చెందిన మిచెల్లీ లీతో తలపడనుంది.
PV Sindhu
Finals
Badminton
Commonwealth Games
India

More Telugu News