Mallikarjun Kharge: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు మరోసారి కరోనా

Congress leader Mallikarjun Kharge tested corona positive for the second time
  • ఈ ఏడాది జనవరిలో ఖర్గేకు తొలిసారి కరోనా
  • హోం ఐసోలేషన్ లో ఉండి కోలుకున్న నేత
  • తాజాగా రెండోసారి పాజిటివ్
  • నిన్న రాజ్యసభలోనూ ప్రసంగించిన ఖర్గే
  • తనను కలిసిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన
రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే మరోసారి కరోనా బారినపడ్డారు. ఆయన ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా కరోనాకు గురయ్యారు. అప్పట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి కోలుకున్నారు. కొన్నినెలల వ్యవధిలోనే ఆయనకు రెండోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన నిన్న రాజ్యసభలో వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కాగా, తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mallikarjun Kharge
Corona Virus
Positive
Congress
Rajya Sabha

More Telugu News