Congress: ప్రియాంక గాంధీకి కరోనా.. రాహుల్​కు అనారోగ్యం

priyanka tests covid agian and rahul gandhi unwell
  • ప్రియాంకకు రెండోసారి సోకిన కరోనా
  • స్వయంగా వెల్లడించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
  • అనారోగ్యంతో నేటి రాజస్థాన్ పర్యటన రద్దు చేసుకున్న రాహుల్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. ప్రియాంక కరోనా పాజిటివ్ గా తేలడం ఇది రెండోసారి. జూన్ లో ఆమె తొలిసారి కరోనా బారిన పడ్డారు. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి పాజిటివ్ గా తేలారు. 

ఆ మధ్య ప్రియాంక తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆమె కోలుకున్నారు. మరోపక్క, రాహుల్ గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఆయన రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Congress
Rahul Gandhi
Priyanka Gandhi
COVID19

More Telugu News