Anitha Vangalapudi: ఎంపీ మాధవ్ విషయంలో అనుకున్నట్టే జరిగింది: టీడీపీ నాయకురాలు అనిత

TDP leader Anitha criticizes on MP Madhav issue
  • ఎంపీ మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • అది ఒరిజినల్ వీడియో కాదన్న అనంతపురం ఎస్పీ
  • మాధవ్ సచ్ఛీలుడు అనే సర్టిఫికెట్ ఇస్తున్నారన్న అనిత
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడినట్టుగా భావిస్తున్న వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ వెల్లడించడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎంపీ మాధవ్ వ్యవహారంలో అనుకున్నట్టే జరిగిందని టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవి అన్నీ చేస్తున్నారని ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్ కు సచ్ఛీలుడు అనే సర్టిఫికెట్ ఇస్తున్నారని విమర్శించారు. 

"అది ఒరిజినలో, కాదో అని నిర్ధారించలేకపోతున్నాం అని మీరు చెప్పారు... బాగుంది. మరి అలాంటప్పుడు అది ఎడిటింగ్, మార్ఫింగ్ అని ఎలా చెబుతారు? నిజం నిలకడ మీద కచ్చితంగా బయటికి వచ్చి తీరుతుంది. నేడు ఈ డర్టీ ఎంపీని సమర్థించిన వారందరూ ఆ రోజు తలదించుకోకతప్పదు" అని స్పష్టం చేశారు.

కాగా, ఈ వీడియో వ్యవహారాన్ని సమర్థిస్తున్నారా, లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అనిత డిమాండ్ చేశారు. ఎంపీ మాధవ్ మీద చర్యలు తీసుకోనట్టయితే ఈసారి మీకు రాష్ట్ర మహిళల దెబ్బ గట్టిగా తగులుతుందని హెచ్చరించారు.
Anitha Vangalapudi
Gorantla Madhav
Video Call
TDP
YSRCP

More Telugu News