Subrahmanyam Jaishankar: హైద‌రాబాద్‌లో విదేశాంగమంత్రి... పాస్‌పోర్టు కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన జైశంకర్

union minister jaishankar visited hyderabad Regional Passport Office
  • హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర మంత్రి జై శంక‌ర్‌
  • పాస్‌పోర్టు కార్యాల‌య సిబ్బందితో గ్రూప్ ఫొటో
  • మెరుగైన సేవలు అందిస్తున్నార‌ని కితాబు
భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ బుధ‌వారం హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌గ‌రంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ కార్యాల‌యం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌లు, ప్ర‌జ‌లకు మెరుగైన సేవలు అందించేందుకు పాస్‌పోర్ట్ కార్యాల‌యం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆయ‌న స‌మీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా పాస్‌పోర్టు కార్యాల‌యం సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగిన జై శంక‌ర్‌... పాస్‌పోర్టు కార్యాల‌య సిబ్బందితో ముచ్చ‌టించారు. పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్నార‌ని ఆయ‌న సిబ్బందిని మెచ్చుకున్నారు. మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న సిబ్బందికి పిలుపునిచ్చారు.
Subrahmanyam Jaishankar
Union Minister
BJP
Hyderabad
Regional Passport Office

More Telugu News