Corbevax: కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్... కేంద్రం అనుమతి

Center approves Corbevax as booster dose
  • ప్రధాన వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోసుకు మరో వ్యాక్సిన్
  • దేశంలో ఇదే ప్రథమం
  • రెండో డోసు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత బూస్టర్
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బూస్టర్ డోసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 

18 ఏళ్లకు పైబడిన వారు కొవాగ్జిన్ గానీ, కొవిషీల్డ్ గానీ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కోర్బెవాక్స్ ను బూస్టర్ డోసుగా ఇవ్వొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ప్రధాన వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోసుగా మరో వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం. కోర్బెవాక్స్ ను హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది.
Corbevax
Corona Vaccine
Booster Dose
COVAXIN
Covishield
India

More Telugu News