Raju Srivastava: విషమంగానే హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం

Comedian Raju Srivastava suffered brain damage after heart attack still on ventilator
  • గుండెపోటుతో పాటు మెదడు కూడా దెబ్బతిన్నట్టు గుర్తింపు
  • ఢిల్లీ ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స 
  • స్టాండప్ కమేడియన్ గా శ్రీవాస్తవకు గుర్తింపు
గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన మెదడు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు తాజా పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 

రాజు శ్రీవాస్తవ థ్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తుండగా ఛాతీలో నొప్పి వచ్చి కుప్పకూలిపోగా.. ట్రెయినర్ వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కి తీసుకువచ్చారు. గుండెను పనిచేయించడానికి వైద్యులు రెండుసార్లు సీపీఆర్ చేశారు. గుండెపోటు సమయంలో, రాజు శ్రీవాస్తవ మెదడుకు విపరీతమైన నష్టం జరిగిందని వైద్యులు చెప్పారు.

 ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు వెంటిలేటర్ సపోర్టుపైనే చికిత్స కొనసాగిస్తున్నారు. రాజు శ్రీవాస్తవ అనేక స్టాండప్ కామెడీ షోలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్, కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షో, శక్తిమాన్ తదితర కార్యక్రమాలలో భాగం అయ్యారు. మైనే ప్యార్ కియా, తేజాబ్, బాజీగర్ వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు.
Raju Srivastava
Comedian
ventilator

More Telugu News