central government: స్వాతంత్య్ర దినోత్సవం ముంగిట రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గనిర్దేశాలు

Avoid Large Gatherings On Independence Day As Covid Cases Rise Centre To States
  • వేడుకల్లో సమూహాలుగా పాల్గొనకుండా చూడాలని సూచన
  • కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం  
  • కరోనా ప్రొటోకాల్స్ పాటించాలని ఆదేశాలు 
స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. దేశంలో ప్రతిరోజూ సగటున 15 వేల పైచిలుకు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో జనం ఒక్క చోట గుమికూడకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించాలని రాష్ట్రాలను కోరింది. 

కేంద్ర ఆరోగ్యశాఖ  విడుదల చేసిన తాజా డేటా ప్రకారం దేశంలో కొత్తగా 16,561 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో, క్రియాశీల కేసులు 1,23,535కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 49 మరణాల నమోదయ్యాయి. 

ఇక, ఈ వేడుకల్లో భాగంగా ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం ప్రతి జిల్లాలో ఒక ప్రముఖ ప్రదేశంలో 'స్వచ్ఛ భారత్' ప్రచారాన్ని నిర్వహించాలని పేర్కొంది. దాన్ని పౌరులంతా పరిశుభ్రంగా ఉంచడానికి 15 నుంచి 30 రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తెలియజేసింది. పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించేందుకు చెట్ల పెంపకం కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలను హోం మంత్రిత్వ శాఖ కోరింది.
central government
states
bjp
Independence Day
Avoid Large Gatherings

More Telugu News