Sonu Sood: ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ఫెయిల్యూర్ పై సోనూసూద్ స్పందన

Sonu Sood on Samrat Prithviraj box office failure says This time we failed

  • ఎంతో కష్టపడి తీసిన సినిమా.. బాగా ఆడాల్సిందన్న అభిప్రాయం
  • తనకు ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందన్న సోనూసూద్
  • ఈ సారి ఫెయిలైనా.. తదుపరి మెరుగ్గా చేస్తామని ప్రకటన

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రతో వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించకపోవడంపై ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించాడు. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' జూన్ 3న విడుదల కావడం తెలిసిందే. ఈ సినిమాని రూ.175 కోట్ల బడ్జెట్ తో తీయగా, ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ.90 కోట్ల వరకే ఉన్నాయి. 

ఈ సినిమాలో ఆస్థాన కవి చాంద్ బర్దాయ్ పాత్రను పోషించిన సోనూసూద్ సినిమా ఫెయిల్యూర్ ను అంగీకరిస్తున్నట్టు చెప్పాడు. ఇది ప్రత్యేకమైన సినిమా అని, చాంద్ బర్దాయ్ తనకు ఎంతో ప్రత్యేకమని ఆయన పేర్కొన్నాడు. తన కెరీర్ లో ఇది ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా నిలిచిపోతుందన్నాడు. 

‘‘నిజానికి సినిమా బాగా ఆడాల్సి ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి నిర్మించిన సినిమా ఇది. ఒక నటుడిగా నూరు శాతం పనితీరును ఇవ్వడం కీలకం. అప్పుడు అది సరైనదా? కాదా? అన్నదానిని ప్రేక్షకులే నిర్ణయిస్తారు. వైఫల్యాలను అంగీకరించడంతోపాటు, వాటి నుంచి నేర్చుకోవాలి. తదుపరి మరింత మెరుగైన ఫలితాలు రాబట్టాలి. నటుడిగా నేను అదే పని చేస్తాను. ఈ సారి విఫలం అయినా.. తదుపరి మరింత మెరుగ్గా చేస్తాం’’ అని సోనూ సూద్ తెలిపాడు. 

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్ చౌహాన్'గా కనిపిస్తాడు. మహమ్మద్ ఘోరిపై పోరాడిన రాజుగా అతడికి పేరు. ఈ సినిమాతో మనుషి చిల్లర్ బాలీవుడ్ అరంగ్రేటం చేసింది.

  • Loading...

More Telugu News