Hyderabad: పంద్రాగస్టున ప్రసంగిస్తూ కుప్పకూలి మరణించిన ఫార్మా వ్యాపారి

Man died while giving speech in august 15th celebrations

  • హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘటన
  • ప్రసంగిస్తుండగా చాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిన వైనం
  • ఆసుపత్రికి తరలించినా ఫలితం శూన్యం

స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. జెండా ఎగురవేసిన అనంతరం ప్రసంగిస్తూ ఓ వ్యక్తి కుప్పకూలి మరణించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ వంపుగూడలో జరిగిందీ ఘటన. ఇక్కడి లక్ష్మీ ఇలైట్ విల్లాస్ కాలనీలో నిన్న ఉదయం త్రివర్ణ పతకాన్ని ఎగువేశారు. ఈ సందర్భంగా ఫార్మా వ్యాపారి ఉప్పల సురేష్ (56) ప్రసంగం మొదలుపెట్టారు.

స్వాత్రంత్య్ర ఉద్యమం, అందుకోసం నెత్తురు చిందించిన వీరుల గురించి ప్రసంగిస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కాలనీవాసులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే ఆయన మరణించినట్టు తెలిపారు. ఉప్పల సురేష్ జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్‌కు చెందినవారు. పాతికేళ్ల క్రితమే ఆయన హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

  • Loading...

More Telugu News