exercise: వ్యాయామాలు చేసే సమయంలో హఠాత్తుగా గుండెపోటు ఎందుకొస్తోంది?

Why does exercise trigger a heart attack

  • ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు గుండెపోటు రిస్క్
  • రక్త ప్రవాహ మార్గంలో, కొవ్వులు, కొవ్వు ఫలకాల చేరిక
  • రిస్క్ అంశాలు తెలుసుకున్న తర్వాతే వ్యాయామాలు చేయడం మంచిది

వ్యాయామాలు చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోతున్న కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ట్రెడ్ మిల్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చావు, బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. అంతకుముందు కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా ఇదే మాదిరిగా ప్రాణాలు విడవడం తెలిసిందే. 

నిజానికి గుండె కండరాల బలోపేతానికి వ్యాయామాలు మంచి చేస్తాయంటారు. మరి వ్యాయామం చేస్తుంటే గుండెపోటు రావడం ఎంటి? అన్న సందేహం చాలా మందికి వస్తోంది. వ్యాయామంతో మంచి ఫలితాలు నిజమే కానీ, చేసే వారి ఆరోగ్య స్థితిగతులు కూడా చూసుకోవాలి. వ్యాయామం తీవ్రతపైనా ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

రక్త సరఫరాలో ఉన్నట్టుండి అడ్డంకి ఏర్పడితే గుండెపోటు వస్తుంది. గుండెకు రక్తాన్ని పంప్ చేసే కరోనరీ ఆర్టరీల్లో అవరోధం కలిగితే హార్ట్ ఎటాక్ కు దారితీస్తుందని తెలుసుకోవాలి. హృదయ ధమనిలో 70 శాతం మేర అవరోధం కలిగితే అప్పుడు యాంజీనా లేదంటే ఛాతీలో నొప్పి వస్తుంది. అదే సమయంలో వ్యాయామం చేస్తున్నట్టు అయితే అధిక ఆక్సిజన్ అవసరపడుతుంది. ఆక్సిజన్ కు డిమాండ్ పెరగ్గా.. అదే సమయంలో ధమనిలో అవరోధంతో గుండెపోటు వస్తుంది. 

ఇక ధమనుల్లో ఏర్పడిన కొవ్వు ఫలకాలు విచ్ఛిన్నమైతే అది రక్తం గడ్డకట్టేందుకు దారితీస్తుంది. 30 శాతం పరిమాణానికి కొవ్వు చేరినప్పుడు ఇలా జరుగుతుంది. కొవ్వు ఫలకాలుగా (గార) పేరుకుపోవడానికి, పొగతాగడం, రక్తపోటు, మధుమేహం, ఆరోగ్యకరం కాని ఆహారం, ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, ఇటీవల ఇన్ఫెక్షన్లకు గురికావడం గుండె పోటుకు దారిస్తాయి. రక్తంలోని కొవ్వులు గాయం అయిన ప్రాంతాలపై గారలా పేరుకుపోతున్నాయి. తీవ్రమైన వ్యాయామాలతో శ్రమించినప్పుడు ఇదే గుండెపోటును కలిగిస్తుంది. 

ఎక్కువగా ఉదయం వేళల్లోనే గుండెపోటు వస్తుంది, ఎందుకు?.. ఎందుకంటే ఉదయం వేళ్లలో రక్తపోటు అధికంగా ఉంటుంది. ఆ సమయంలోనే రక్తంలో క్లాట్ రిస్క్ పెరుగుతుంది. తగినంత నిద్రపోని వారు, తగినంత నీరు తీసుకోని వారు, తీవ్ర, కఠిన వ్యాయామాలు చేసేవారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 

వ్యాయామం మంచిదేనా? అన్న సందేహం అక్కర్లేదు. జిమ్ లో కసరత్తులు చేసే వారు, ట్రెడ్ మిల్ చేసేవారు వేగంగా బ్రిస్క్ వాక్ చేసే వారు తమ రిస్క్ అంశాలను ముందే తెలుసుకుని జాగ్రత్త పడాలి. తప్పకుండా వైద్యులను సంప్రదించి, తమ గుండె, ఇతర అవయవాల పనితీరును చెక్ చేయించుకోవాలి.

  • Loading...

More Telugu News