Panneer selvams: అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్.. పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు

Madras HC rules in Panneer selvams favour orders fresh AIADMK general council meeting

  • పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీని తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
  • కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ లేకుండా చెల్లదన్న న్యాయమూర్తి
  • పళనిస్వామి వర్గానికి ఎదురుదెబ్బ

అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వంకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 23 నాటికి ఉన్న స్థితిని పునరుద్ధరించాలని జస్టిస్ జి.జయచంద్రన్ ఆదేశించారు. లోగడ జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ చెల్లుబాటు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తాజాగా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

‘‘జూన్ 23 నాటికి అన్నాడీఎంకే పార్టీలో ఉన్న స్థితే కొనసాగాలి. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ సమ్మతి లేకుండా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకూడదు’’ అని ధర్మాసనం తీర్పు జారీ చేసింది. ఈ కేసు విచారణను లోగడ జస్టిస్ రామస్వామి చేబట్టారు. ఆ తర్వాత జస్టిస్ జయచంద్రన్ బెంచ్ కు బదిలీ చేశారు. పన్నీర్ సెల్వం న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ మార్పు జరిగింది. 

న్యాయవ్యవస్థపై నమ్మకం లేదనడం పట్ల కోర్టు ఆగ్రహాన్ని కూడా పన్నీర్ సెల్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి ఆయన క్షమాపణ కోరారు. అయినప్పటికీ, పిటిషనర్ కోరినట్టు జడ్జిలో మార్పు జరిగింది. ఈ అంశంలో లోగడ పళనిస్వామి వర్గానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News