Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 38 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 12 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.80 శాతం లాభపడ్డ కోటక్ బ్యాంక్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 60,298కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,957 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (3.80%), ఎల్ అండ్ టీ (2.03%), భారతి ఎయిర్ టెల్ (1.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.53%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.31%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.30%), విప్రో (-1.67%), ఇన్ఫోసిస్ (-1.38%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.92%), యాక్సిస్ బ్యాంక్ (-0.87%).