Yuzvendra Chahal: చాహల్ తో విడిపోతున్నట్టు వస్తున్న దుమారంపై ధనశ్రీవర్మ స్పందన

Dhanashree Verma reacts to separation rumours with Yuzvendra Chahal after removing Chahal from her name on Instagram
  • తమ వైవాహిక బంధంపై పుకార్లను నమ్మవద్దన్న ధనశ్రీ
  • దయచేసి వీటికి ముగింపు పలకాలంటూ వినతి
  • ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్
భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీవర్మ విడిపోతున్నారంటూ వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. దీంతో అటు చాహల్, ఇటు ధనశ్రీ ఇద్దరూ స్పందించాల్సి వచ్చింది. అసలు దీనంతటికీ కారణం వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులేనని చెప్పుకోవాలి. 

కొత్త జీవితం ప్రారంభం కానుందంటూ చాహల్ పోస్టు పెట్టగా, తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో తన పేరు నుంచి చాహల్ ను ధనశ్రీవర్మ తొలగించింది. దీంతో ఎవరికి తోచినట్టు వారు దీనికి భాష్యాలు చెప్పుకుంటున్నారు. దీనిపై చాహల్ స్పందిస్తూ, తమ వైవాహిక బంధంపై వస్తున్నవన్నీ పుకార్లేనని, దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని కోరాడు. వాటికి ఇంతటితో ముగింపు పలకాలని కోరాడు.

ఇటు ధనశ్రీవర్మ కూడా ఇన్ స్టా గ్రామ్ లో స్పందించింది. ‘‘మా బంధం గురించి వస్తున్న పుకార్లు వేటినీ కూడా నమ్మవద్దని వినయపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి వీటికి ముగింపు పలకండి. ప్రతి ఒక్కరి జీవితాలు ప్రేమతో వెలిగిపోవాలి’’ అని పోస్ట్ పెట్టింది.
Yuzvendra Chahal
Dhanashree Verma
leg spinner
bowler
cricketer

More Telugu News