CJI NV Ramana: నా ఉన్నతికి, విజయానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు: సీజేఐ ఎన్వీ రమణ
- న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్న సీజేఐ
- న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్య
- కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్న జస్టిస్ రమణ
దేశంలో కోర్టుల్లో ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు. న్యాయవ్యవస్థను బలోపేతం చేసే పనుల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని చెప్పారు.
విజయవాడలో ఈరోజు నూతన కోర్టు కాంప్లెక్స్ ను సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.