Allu Arjun: న్యూయార్క్ లో సందడి చేసిన అల్లు అర్జున్

Allu Arjun makes grand entry at India Day parade in New York
  • భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు
  • వెంట భార్య స్నేహారెడ్డి
  • గ్రాండ్ మార్షల్ అవార్డుతో అల్లు అర్జున్ కు సత్కారం
  • న్యూయార్క్ మేయర్ ఆడమ్స్ తో ప్రత్యేక భేటీ
అల్లు అర్జున్ ఇటీవలే న్యూయార్క్ పర్యటనకు వెళ్లొచ్చాడు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అమెరికాలోని భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ఇండియా డే పరేడ్ కార్యక్రమానికి భార్య స్నేహారెడ్డి తో కలసి హాజరయ్యాడు.  ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని చేత్తో పట్టుకుని రెపరెపలాండించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అల్లు అర్జున్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. 

అల్లు అర్జున్ కు ‘గ్రాండ్ మార్షల్’ అవార్డును ఇచ్చి అక్కడి వారు సత్కరించారు.  తనకు గ్రాండ్ మార్షల్ అవార్డును ఇవ్వడం పట్ల అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు. సినిమా, వినోద ప్రపంచానికి అందించిన సేవలకు గాను ఈ గౌరవాన్ని అందించారు. ద ఫెడరేషన్ ఆఫ్ న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ కనెక్టికట్ సంయుక్తంగా 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర సంబరాలను నిర్వహించాయి.

ఇక అల్లు అర్జున్ న్యూయార్క్ పర్యటనలో ప్రత్యేకత ఏమిటంటే.. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ను కలుసుకున్నాడు. ఇద్దరూ కలసి పుష్ప మాదిరిగా తగ్గేదేలే అన్న సంకేతంగా గడ్డం కింద చేయి పెట్టుకుని ఫొటోలకు పోజు లిచ్చారు. ‘‘న్యూయార్క్ మేయర్ ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో ఉత్సాహంగా ఉండే జెంటిల్ మ్యాన్. ఈ గౌరవం చూపించిన మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ కు ధన్యవాదాలు. తగ్గేదేలే!’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)
Allu Arjun
sneha reddy
New York
India Day parade
newyork mayor

More Telugu News