Baba Ramdev: బాబా రాందేవ్ అల్లోపతి వైద్యులను ఎందుకు నిందిస్తుంటారు?: సుప్రీంకోర్టు

Supreme Court asks why Baba Ramdev questioning Allopathy medication
  • ఇంగ్లీషు వైద్యంపై బాబా రాందేవ్ విమర్శలు
  • సుప్రీంకోర్టులో ఐఎంఏ పిటిషన్
  • ఇతర వైద్య విధానాలను తప్పుపట్టడం సరికాదన్న సుప్రీం
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలపై తరచుగా వ్యాఖ్యలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు విమర్శనాత్మకంగా స్పందించింది. 'బాబా రాందేవ్ అల్లోపతి వైద్యులను నిందిస్తుంటారు ఎందుకు?' అంటూ అసహనం ప్రదర్శించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన ఓ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని  సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అల్లోపతి వైద్య విధానంపైనా, అల్లోపతి వైద్యులపైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ ఆ పిటిషన్ లో ఆరోపించారు. 

దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు... ఇప్పటికే యోగాకు అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టిన బాబా రాందేవ్, ఆయుర్వేదానికి కూడా అలాగే ప్రజాదరణ కల్పించేలా ప్రచారం చేసుకోవచ్చని, అంతేతప్ప ఇతర వైద్య విధానాలను తప్పుబట్టడం సరికాదని హితవు పలికింది. 'మీరు అనుసరించే వైద్య విధానాలు అన్ని రుగ్మతలను నయం చేస్తాయన్న గ్యారంటీ ఏమైనా ఉందా?' అని బాబా రాందేవ్ ను ప్రశ్నించింది.  

కొవిడ్ సంక్షోభ సమయంలో రాందేవ్ చేసిన వ్యాఖ్యలు డాక్టర్లకు ఆగ్రహం తెప్పించాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న అనేకమంది డాక్టర్లు మృత్యువాత పడ్డారని, అల్లోపతి ఒక మూర్ఖ వైద్య విధానం అని రాందేవ్ వ్యాఖ్యానించారు.
Baba Ramdev
Supreme Court
Allopathy
Ayurvedic
COVID19

More Telugu News