Chandrababu: శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు-పద్మారావు.. పరస్పర పలకరింపులు

Chandrababu and Telangana dy speaker T Padmarao met on shamshabad
  • బెంగళూరు వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు దంపతులు
  • కుప్పం వెళ్లేందుకు వచ్చిన చంద్రబాబు
  • రన్‌వే ఫ్లైట్ కనెక్టివిటీ బస్సులో కలిసి ప్రయాణం
  • క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న నేతలు
బెంగళూరులో బంధువుల శుభకార్యానికి వెళ్తున్న తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు దంపతులు, కుప్పం వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. విమానం ఎక్కేందుకు రన్ వేలోని ఫ్లైట్ కనెక్టివిటీ బస్సులో వీరిద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

పద్మారావు.. చంద్రబాబు ఇద్దరూ పక్కపక్క సీట్లలోనే కూర్చుని ముచ్చటించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల క్షేమ సమాచారాన్ని పరస్పరం అడిగి తెలుసుకున్నారు. అలాగే,  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాల గురించి కాసేపు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
Chandrababu
T.Padmarao
Shamshabad
Andhra Pradesh
Telangana

More Telugu News