Raju Srivastava: 15 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన బాలీవుడ్ నటుడు రాజు శ్రీవాస్తవ
- ప్రకటించిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి నారంగ్
- ఈ నెల 10న తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిన నటుడు
- అప్పటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స
బాలీవుడ్ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఎట్టకేలకు గురువారం ఉదయం స్పృహలోకి వచ్చారు. 15 రోజులుగా వైద్యులు అందిస్తున్న చికిత్స ఫలితమిస్తోంది. ఆయన ఆరోగ్యంపై వ్యక్తిగత కార్యదర్శి గర్విత్ నారంగ్ ప్రకటన చేశారు. 58 ఏళ్ల రాజు శ్రీవాస్తవ తీవ్ర గుండెపోటుతో ఈ నెల 10న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరడం తెలిసిందే.