Yarlagadda Lakshmi Prasad: అధికార భాషా సంఘానికి కూడా లేని అధికారాలను ఈ సంస్థకు ఇచ్చారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటైందన్న యార్లగడ్డ
- చర్యలు తీసుకునే అధికారం ఈ సంస్థకు ఉందని వెల్లడి
- తెలుగు పరిరక్షణకు సీఎం జగన్ చర్యలు అమోఘమని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటైందని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. అధికార భాషా సంఘానికి కూడా లేనటువంటి విశేష అధికారాలను ఈ సంస్థకు ఇచ్చారని తెలిపారు. పాలనా భాషగా తెలుగును అమలు పర్చని అధికారులు, వ్యవస్థలపై చర్యలు తీసుకునే అధికారం ఈ ప్రాధికార సంస్థకు ఉందని స్పష్టం చేశారు.
తెలుగు భాషా వికాసానికి, పరిరక్షణకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అమోఘం అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. గత ప్రభుత్వంలో మూసివేసిన తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవంగా ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు.