Jharkhand: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం రద్దు
- అక్రమంగా గనులు కేటాయించుకున్నారని సోరెన్‌పై ఆరోపణలు
- కేంద్రానికి సోరెన్‌పై ఫిర్యాదు చేసిన గవర్నర్
- ఎన్నికల సంఘానికి ఫిర్యాదును రెఫర్ చేసిన కేంద్రం
- సోరెన్ శాసన సభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫారసు
- హేమంత్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిన గవర్నర్ రమేశ్ బయాస్
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం శుక్రవారం రద్దయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల విడుదలతో ఈ క్షణం నుంచే హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దయిపోయినట్లే.
తనకు తానుగా గనులను కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై విమర్శల వెల్లువ కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హేమంత్ వ్యవహార సరళిపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును కేంద్రం... ఎన్నికల సంఘానికి పంపడం, హేమంత్ శాసన సభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫారసు చేయడం, ఈసీ సిఫారసు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం వేగంగా జరిగిపోయాయి. ఈ కీలక పరిణామం తర్వాత తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ఎలాంటి అడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.