Sky Surfing: ఆకాశంలో తలకిందులుగా గిరగిరా తిరుగుతూ.. హెలికాప్టర్​ నుంచి దూకి ఓ యువకుడి సాహసం.. వీడియో ఇదిగో

Man sky surfed 175 helicopter spins in single jump

  • సర్ఫింగ్ బోటును కాళ్లకు కట్టుకుని హెలికాప్టర్ స్పిన్స్ చేసిన అమెరికా యువకుడు
  • ఒకేసారి ఏకంగా 175 సార్లు తిరిగి రికార్డు నమోదు
  • వీడియో విడుదల చేసిన గిన్నిస్ బుక్ సంస్థ

మామూలుగా గుండ్రంగా తిరిగితే పది పన్నెండు చుట్లు తిరగగానే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలతిరిగిపోతున్నట్టు అయి కింద పడిపోతుంటాం. అదే ఒకేసారి 175 చుట్లు తిరిగితే అమ్మో గ్రేటే అంటారు. మరి ఆ చుట్లు కూడా తలకిందులుగా గాల్లో వేలాడుతూ తిరిగితే.. వామ్మో అనిపిస్తుంది. అమెరికాకు చెందిన ఓ యువకుడు ఇలా తలకిందులుగా గాల్లో చుట్లు తిరిగి.. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. దీనికి సంబంధించి గిన్నిస్ బుక్ తాజాగా వీడియోను తమ యూట్యూబ్ చానల్ లో పెట్టింది.

స్కై సర్ఫింగ్ చేస్తూ..
  • అమెరికాకు చెందిన కీత్ కెబె ఎడ్వర్డ్ స్నైడర్ స్కై సర్ఫింగ్ చేస్తుంటాడు. అంటే వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి దూకి నేల మీదకు సర్ఫింగ్ చేస్తున్నట్టుగా రావడమన్నమాట.
  • ఈ క్రమంలోనే తాజాగా తన కాళ్లకు సర్ఫింగ్ బోటును కట్టుకుని.. తలకిందులుగా హెలికాప్టర్ స్పిన్స్ (సర్ఫింగ్ బోట్ హెలికాప్టర్ పైన బ్లేడ్లలా తిరుగుతూ, కింద తాను గుండ్రంగా తిరుగుతుండటం) చేశాడు.
  • గత నెలలో వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి ఒకే దఫాలో ఏకంగా 175 రివర్స్ స్పిన్స్ చేశాడు. 
  • ఇతను 2021లో కూడా ఈజిప్ట్‌లోని గిజాలో పిరమిడ్ల సమీపంలో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే అప్పట్లో 165 చుట్లు తిరగగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు.
  • గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ఫీట్ ను హెలికాప్టర్ లోంచి పరిశీలించడంతోపాటు వీడియోను చిత్రీకరించారు. దీనిని ఇటీవలే తమ యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు.
 

  • Loading...

More Telugu News