YSRCP: ఉప‌రాష్ట్రప‌తిని కలిసిన వైసీపీ ఎంపీ నిరంజ‌న్ రెడ్డి... ఫొటో ఇదిగో

ysrcp mp Niranjan Reddy called on the Vice President Jagdeep Dhankhar
  • జ‌గ‌న్ కేసుల‌ను వాదించే లాయ‌ర్‌గా నిరంజ‌న్ రెడ్డికి పేరు 
  • తెలంగాణ‌కు చెందిన నిరంజ‌న్‌కు ఏపీ కోటాలో రాజ్య‌స‌భ సభ్యత్వం  
  • ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపిన ఎంపీ
ఎస్‌.నిరంజ‌న్ రెడ్డి.. తెలంగాణ‌కు చెందిన‌ యువ న్యాయ‌వాది ఆయన. వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాఖలైన కేసుల్లో జ‌గ‌న్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించే లాయ‌ర్‌. ఆయన ఇటీవ‌లే ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

ఇక ఇటీవ‌లే భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్‌ను ప‌లువురు ప్ర‌ముఖులు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ నిరంజ‌న్ రెడ్డి నేడు జ‌గ‌దీప్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోను ఉప‌రాష్ట్రప‌తి కార్యాలయం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.
YSRCP
YS Jagan
S. Niranjan Reddy
Lawyer
Telangana
Andhra Pradesh
Rajya Sabha
Upa Rashtrapati Nivas
Jagdeep Dhankhar
Vice President

More Telugu News