study permit: ప్రాసెసింగ్ దశలో 75,000 భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులు: కెనడా

75000 study permit applications submitted from India in processing stage Canada

  • ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నామన్న ఐఆర్ సీసీ
  • 2019తో పోలిస్తే 55 శాతం అధికంగా దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడి
  • కొన్ని దరఖాస్తుల ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చని సంకేతం

కెనడాకు వెళ్లేందుకు ఈ ఏడాది ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ లో మొదలయ్యే కోర్సులకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నట్టు కెనడా అధికారులు తెలిపారు.

వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు ‘రెఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్ సీసీ) అధికారులు ప్రకటించారు. ఆగస్ట్ 15 నాటికి భారత్ నుంచి 75,000 మంది విద్యార్థులు స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. వీరంతా కెనడాలో ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్నవారు కావడం గమనార్హం.

2022 మొదటి ఐదు నెలల్లో భారత్ నుంచి 1,23,500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, 2019లో ఇదే కాలంలో వచ్చిన దరఖాస్తుల కంటే ఇది 55 శాతం అధికమని వారు వెల్లడించారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నందున.. సెప్టెంబర్ లో బోధన ప్రారంభమయ్యే నాటికి అన్నీ పరిష్కారం కాకపోవచ్చని ఐఆర్ సీసీ అంటోంది.

  • Loading...

More Telugu News