Taliban: కాబూల్ దాటి వెళ్లొద్దు...  విదేశాల్లో చదివేందుకు ఆఫ్ఘన్ అమ్మాయిలపై తాలిబన్ల ఆంక్షలు

Taliban bans foreign education for girls of Afghanistan
  • ఆఫ్ఘన్ ను వీడిన అమెరికా సేనలు
  • గతేడాది ఆఫ్ఘన్ పగ్గాలు చేపట్టిన తాలిబన్లు
  • ఛాందసవాద ధోరణులతో పలు ఆంక్షలు
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల నిరంకుశ పాలన కొనసాగుతోంది. మహిళలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ఆఫ్ఘన్ ఛాందసవాద పాలకులు, తాజాగా విద్యార్థినులపై హుకుం జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ అమ్మాయిలను విదేశాల్లో చదివేందుకు అంగీకరించబోమని, వారు కాబూల్ దాటి వెళ్లరాదని హెచ్చరించారు. అదే సమయంలో అబ్బాయిలు విదేశాల్లో చదవడంపై తాలిబన్లు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలుస్తోంది. 

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వెనుదిరిగిన తర్వాత 2021 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్థాన్ పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసిన తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టారు. వచ్చీ రావడంతోనే తమదైన ముద్ర వేస్తూ మహిళలపై పలు ఆంక్షలు విధించారు. మహిళలు తమ ఇల్లు దాటి వచ్చి పనిచేయడంపై నిషేధాజ్ఞలు ప్రకటించారు. అమ్మాయిలకు ఆరో తరగతి వరకే చదువు, స్కూల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా విద్యాభ్యాసం వంటి నిర్ణయాలతో తామేమీ మారలేదని నిరూపించుకున్నారు. 

అంతేకాదు, మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే పూర్తిగా కప్పేసేలా దుస్తులు ధరించాలని కూడా స్పష్టం చేశారు. మహిళలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్కుల్లోకి రావడంపైనా నిషేధం ప్రకటించారు.
Taliban
Girls
Education
Foreign
Kabul
Afghanistan

More Telugu News