YSRCP: జ‌గ‌న్‌కు, కిమ్‌కు న‌క్క‌కు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: సీపీఐ నారాయ‌ణ‌

cpi narayana responds on chandrababu comments on ys jagan
  • కిమ్ అమెరికానే గ‌డ‌గ‌డ‌లాడించార‌న్న నారాయ‌ణ‌
  • మురికి గుంట‌ల్లో చేప‌లు ప‌ట్టుకునే జ‌గ‌న్‌తో కిమ్ పోలిక స‌రికాద‌ని వ్యాఖ్య‌
  • వైసీపీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోప‌ణ‌
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని... నియంతగా పేరొందిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో పోలుస్తూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా స్పందించిన సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌... జ‌గ‌న్ స్థాయి కిమ్‌కు ఏమాత్రం స‌రిపోదన్నారు.  

జ‌గ‌న్‌కు, కిమ్‌కు న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా లాంటి సామ్రాజ్య‌వాదాన్ని కిమ్‌ గ‌డ‌గ‌డ‌లాడించారన్న నారాయ‌ణ‌... మురికిగుంట‌ల్లో చేప‌లు ప‌ట్టుకునే జ‌గ‌న్ లాంటి వాళ్ల‌తో ఆయ‌న‌ను పోల్చడం స‌రికాదని అన్నారు. కుప్పంలో చంద్ర‌బాబును అడ్డుకోవాల‌నుకోవ‌డం త‌గ‌దని నారాయ‌ణ అన్నారు. 

సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాన‌ని చెబుతున్న జ‌గ‌న్‌కు భ‌య‌మెందుకని ప్ర‌శ్నించిన నారాయ‌ణ‌... బెదిరించి, భ‌య‌పెట్టి వైసీపీ పాల‌న చేయాల‌నుకుంటోందని ఆరోపించారు. హ‌త్యా రాజ‌కీయాల‌ను వైసీపీ ప్రోత్స‌హిస్తోందని కూడా నారాయ‌ణ మ‌రో ఆరోప‌ణ చేశారు.
YSRCP
YS Jagan
Chandrababu
TDP
Kuppam
CPI Narayana
CPI
Kim Jong-un
North Korea

More Telugu News