Pawan Kalyan: ట్విట్టర్ లో 5 మిలియన్ మార్క్ అందుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan Twitter followers number reach 5 million mark
  • 2014లో ట్విట్టర్ ఖాతా తెరిచిన పవన్ 
  • ఎనిమిదేళ్లలో 50 లక్షల మంది ఫాలోవర్లు
  • అందరికీ కృతజ్ఞతలు తెలిపిన జనసేన
  • సలహాలు, సూచనలకు ఆహ్వానం అని వెల్లడి
జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో 5 మిలియన్ మార్క్ అందుకున్నారు. ఆయనను ట్విట్టర్ లో అనుసరించేవారి సంఖ్య 50 లక్షలకు చేరింది. పవన్ కల్యాణ్ 2014 ఆగస్టులో ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. పవన్ తన ట్విట్టర్ అకౌంట్లో రాజకీయపరమైన వ్యాఖ్యల కంటే, ప్రపంచ విషయాలు, పుస్తకాలు, తదితర అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. 

కాగా, ఆయన 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న నేపథ్యంలో, జనసేన పార్టీ స్పందించింది. పవన్ ను ట్విట్టర్ లో అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది. పొగడ్త అయినా, సద్విమర్శ అయినా శిరోధార్యమేనని, మెరుగైన సలహాలు, సూచనలకు ఎల్లవేళలా ఆహ్వానం పలుకుతామని పేర్కొంది. మీ అభిమానం అనిర్వచనీయం, ఆనందదాయకం అని ఓ ప్రకటన వెలువరించింది.
Pawan Kalyan
Followers
Twitter
Social Media
Janasena
Andhra Pradesh

More Telugu News