- హోల్ మీల్ ఆటా, సెమోలినా ఎగుమతులపైనా ఇదే నిర్ణయం
- కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం
- ధరల పెరుగుదలను అరికట్టడమే లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ఆహార భద్రత, ధరల నియంత్రణ కోసం గోధుమ పిండి, మైదా పిండి, హోల్ మీల్ ఆటా, సెమోలినా ఎగుమతులను నిషేధిస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని కేసుల్లో, అది కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి మేరకే వీటి ఎగుమతులకు అవకాశం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తెలిపింది.
ఈ ఉత్పత్తులను స్వేచ్ఛా ఎగుమతుల నుంచి నిషేధిత జాబితాలోకి చేర్చినట్టు డీజీఎఫ్టీ ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలోనూ కేంద్ర సర్కారు గోధుమల ఎగుమతులను నిషేధించింది. ప్రపంచదేశాల వినతితో కొన్ని రోజుల తర్వాత సడలించి, ఎత్తివేసింది. తిరిగి అంతర్జాతీయంగా ఆహార ధాన్యాల కొరత కారణంగా రేట్లు పెరుగుతుండడంతో మళ్లీ నిషేధ నిర్ణయం తీసుకుంది. శనివారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఈ విడత గోధుమలపై కాకుండా, గోధుమ పిండికి నిషేధాన్ని పరిమితం చేసింది.
ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ కు గోధుమల ఎగుమతిలో ఉక్రెయిన్, రష్యా రెండు పెద్దదేశాలుగా ఉన్నాయి. ఈ రెండూ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి యుద్ధానికి దిగడంతో గోధుమలకు కొరత ఏర్పడింది.