Tiger Shroff: ఆగిపోయిన రష్మిక మందన్న, టైగర్ ష్రాఫ్ ల చిత్రం

Rashmika Mandanna and Tiger Shroff film stopped

  • రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ అడిగిన టైగర్ ష్రాఫ్
  • రూ. 20 కోట్లు పారితోషికం, లాభాల్లో వాటా తీసుకోవాలన్న కరణ్ జొహార్
  • టైగర్ ష్రాఫ్ ఒప్పుకోకపోవడంతో ఆగిపోయిన సినిమా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న బాలీవుడ్ పై దృష్టి సారించింది. 'పుష్ప' సినిమా హిట్ కావడంతో నార్త్ లో రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్ ఇప్పటికే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో కరణ్ జొహార్ నిర్మిస్తున్న 'స్క్రూ ఢీలా' చిత్రం ఆగిపోయింది. 
 
వివరాల్లోకి వెళ్తే, 'స్క్రూ ఢీలా' చిత్రాన్ని రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చేసేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై టైగర్ ష్రాఫ్ సంతకం చేశాడు. అయితే, పారితోషికాన్ని తగ్గించుకోవాలని.. లాభాల్లో వాటా తీసుకోవాలని టైగర్ ను కరణ్ జొహార్ కోరారు. రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని చెప్పారు. నటీనటుల రెమ్యునరేషన్లతో కలుపుకుని సినిమా నిర్మాణానికి రూ. 140 కోట్ల వరకు ఖర్చవుతోందట. దీనికి సినిమా ప్రచార కార్యక్రమాల ఖర్చు అదనం. 

ప్రస్తుతం బాలీవుడ్ విషమ పరీక్షలను ఎదుర్కొంటోంది. సినిమాలు పెద్దగా వసూళ్లను రాబట్టడం లేదు. దీంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని లాభాల్లో వాటా తీసుకోవాలని టైగర్ ష్రాఫ్ ను కరణ్ జొహార్ కోరారు. అయితే, పారితోషికాన్ని తగ్గించుకోవడానికి టైగర్ ఒప్పుకోలేదు. దీంతో, సినిమా ఆగిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో, రష్మిక ఒక బాలీవుడ్ సినిమాను కోల్పోయినట్టయింది.

  • Loading...

More Telugu News