Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై మహిళా నేతల ఫిర్యాదు... స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

President office responds to Women JAC complaint on MP Madhav issue

  • సంచలనం సృష్టించిన ఎంపీ మాధవ్ వీడియో కాల్
  • మాధవ్ అంశంలో చర్యలు తీసుకోవాలన్న మహిళా జేఏసీ నేతలు
  • ఫిర్యాదును ఏపీ సీఎస్ కు పంపిన రాష్ట్రపతి కార్యాలయం
  • తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు పంపించింది. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

అంతకుముందు, ఎంపీ మాధవ్ అంశంపై మహిళా జేఏసీ నేతలు మాధవ్ పై చర్యలు తీసుకునేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. అటు, ఉప రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్, కేంద్రమంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, ఫిర్యాదు పట్ల స్పందించినట్టు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది.

  • Loading...

More Telugu News