Prakash Raj: నిన్నటి మ్యాచ్ లో త్రివర్ణ పతాకాన్ని తీసుకునేందుకు జై షా నిరాకరించడంపై ప్రకాశ్ రాజ్ స్పందన

Prakash Raj responds on Jai Shah denied to taka national flag
  • నిన్న ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • విజయం సాధించిన భారత్
  • త్రివర్ణ పతాకాన్ని జై షాకు ఇవ్వబోయిన వ్యక్తి
  • సున్నితంగా తిరస్కరించిన జై షా
ఆసియా కప్ లో భాగంగా నిన్న టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ మ్యాచ్ కు బీసీసీఐ కార్యదర్శి జై షా (అమిత్ షా తనయుడు) కూడా విచ్చేశారు. యూఏఈ క్రికెట్ పెద్దలు, ఇతర ప్రముఖులతో కలిసి మ్యాచ్ ను వీక్షించారు. అయితే, మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించగా, గ్యాలరీలో ఉన్న ఓ వ్యక్తి జై షాకు త్రివర్ణ పతాకాన్ని అందించే ప్రయత్నం చేశారు. అయితే, జాతీయ జెండాను చేతిలోకి తీసుకునేందుకు జై షా నిరాకరించారు. ఈ దృశ్యాలతో కూడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. "ప్రియమైన మహానేత, హోంమంత్రి... జై షా తన దేశభక్తిని నిరూపించుకోవడానికి జాతీయ జెండాను చేతిలోకి తీసుకుని ఊపేందుకు నిరాకరించారు. ఒకవేళ బీజేపీయేతర వ్యక్తో, హిందుయేతరుడో, నాలాగా మిమ్మల్ని ప్రశ్నించేవాడో ఇలాగే చేసుంటే మీరు, మీ బీజేపీ భక్తులు ఎలా స్పందించేవారు?" అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
Prakash Raj
Jai Shah
National Flag
Team India
Pakistan
Asia Cup

More Telugu News