Nakka Anand Babu: దళితుడు కాబట్టే కానిస్టేబుల్ ప్రకాశ్ ను ఉద్యోగం నుంచి తీసేశారు: నక్కా ఆనందబాబు ఆరోపణ

YSRCP govt terminated constable because he is Dalit says Nakka Anand Babu
  • జగన్ ను సీఎం చేసిన పాపానికి దళితులు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్న ఆనందబాబు 
  • అధికారంలోకి వచ్చేందుకు దళితుల పట్ల కపట ప్రేమను చూపించారని వ్యాఖ్య 
  • గోరంట్ల మాధవ్ కు రాచమర్యాదలు చేశారంటూ విమర్శలు 
జగన్ కు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిన పాపానికి దళితులంతా ఎవరికివారు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏపీలో నెలకొందని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. అనంతపురంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ దళితుడు కావడం వల్లే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని, ఉద్యోగం నుంచి తీసేసేంత వరకు ఆయన పట్ల కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రకాశ్ పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే పోలీసులు సుమోటోగా కేసు పెట్టారని అన్నారు. 

అదే జిల్లాకు చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ రాచమర్యాదలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమకు న్యాయపరంగా రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ప్రకాశ్ పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్య దారుణమని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దళితుల పట్ల జగన్ కపట ప్రేమను చూపించారని... అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Nakka Anand Babu
Telugudesam
Jagan
YSRCP
Dalits
Gorantla Madhav

More Telugu News