Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ భారీ వరదలో చిక్కుకుపోయిన కుటుంబం

Family followed google maps drove into flood waters
  • తమిళనాడులో ఘటన
  • గూగుల్ మ్యాప్స్ సాయంతో ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసిన వ్యక్తి
  • బాగేపల్లి బ్రిడ్జి ద్వారా దారి చూపించిన గూగుల్ మ్యాప్స్
  • అలాగే ముందుకెళ్లి ప్రమాదంలో పడిన రాజేశ్ కుటుంబం
  • భారీ క్రేన్లు ఉపయోగించి రక్షించిన అధికారులు
గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లిన ఓ కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమ పడాల్సి వచ్చింది. తమిళనాడులో జరిగిందీ ఘటన. కర్ణాటకలోని సర్జాపూర్‌కు చెందిన రాజేశ్.. కుటుంబంతో కలిసి కారులో హోసూర్ వెళ్లాడు. పనులు ముగించుకున్న తర్వాత తిరిగి గ్రామానికి బయలుదేరాడు. అయితే, ఈసారి అతడు గూగుల్ మ్యాప్స్‌ను ఎంచుకున్నాడు. అది చూపించిన దారిలో పయనమయ్యాడు. అలా తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని బాగేపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా మ్యాప్స్‌ను నమ్ముకుని అలానే ముందుకెళ్లాడు. ఆ తర్వాత కానీ అతడికి తాము ప్రమాదంలో పడినట్టు అర్థం కాలేదు. 

భారీ వరదలో తాము చిక్కుకుపోయామని గ్రహించి కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, కారు చిక్కుకుపోవడంతో సాధ్యం కాలేదు. వెంటనే అప్రమత్తమైన రాజేశ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వారు  ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ క్రేన్లను ఉపయోగించి వరదలో చిక్కుకున్న కారును బయటకు తీసి వారిని రక్షించారు.


Google Maps
Flood Waters
Tamil Nadu
Karnataka

More Telugu News