Andhra Pradesh: ఏపీకి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను ప్ర‌క‌టించిన కేంద్రం... మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సోము వీర్రాజు

union government approves a bulk drug park to andhra pradesh
  • తూర్పుగోదావ‌రి జిల్లా కేసీ పురంలో బల్క్ డ్ర‌గ్ పార్క్‌కు కేంద్రం ఆమోదం
  • రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసిన కేంద్ర ప్ర‌భుత్వం
  • న‌రేంద్ర మోదీ, జేపీ న‌డ్డాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన వీర్రాజు
ఏపీకి కేంద్రం మ‌రో పారిశ్రామిక పార్క్‌ను కేటాయించింది. రాష్ట్రంలోని తూర్పు గోదావ‌రి జిల్లా కేసీ పురంలో బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సోష‌ల్ మీడియాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

ఏపీకి బల్క్ డ్ర‌గ్ పార్క్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని సోము వీర్రాజు త‌న ట్వీట్‌లో తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రం ఓ లేఖ రాసింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఏపీకి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను కేటాయించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు.
Andhra Pradesh
BJP
Somu Veerraju
Prime Minister
Narendra Modi
JP Nadda
Bulk Drig Park
East Godavari District

More Telugu News