Girls: దేశంలో తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల

First Cervical Cancer vaccine launched in India for girls

  • దేశీయంగా అభివృద్ధి చేసిన గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్
  • 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలికలకు వ్యాక్సినేషన్
  • జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్రం నిర్ణయం

మన దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో భారత్ లో క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. మహిళల విషయానికి వస్తే గర్భాశయ క్యాన్సర్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో, గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు మన దేశంలో వ్యాక్సిన్ విడుదలయింది. దేశంలో తొలిసారి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను విడుదల చేశారు. ఢిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఈ వ్యాక్సిన్ ను విడుదల చేశారు. ఈ వ్యాక్సిన్ ను దేశీయంగా అభివృద్ధి చేశారు. 

9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ ఎన్.కే.అరోరా మాట్లాడుతూ... 90 శాతం వరకు గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్టమైన వైరస్ వల్ల వస్తుందని.. ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ కు వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను తయారు చేసే బాధ్యతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్పగించింది.

  • Loading...

More Telugu News